Tuesday, 23 September 2025

వ్యాస ప్రసాదా చ్ఛృతవాన్

వ్యాస ప్రసాదా చ్ఛృతవాన్ ఏతద్గుహ్యమహం పరమ్। యోగం యోగేశ్వరాత్ కృష్ణాత్ సాక్షాత్ కథయతస్స్వయమ్॥75॥ శ్రీమద్భగవద్గీత...అష్టాదశాథ్యాయము మోక్ష సన్న్యాస యోగము సంజయుడికి ఏమీ అర్థం కావటం లేదు.అతని ఆనందానికి అవథులు లేవు.అసలు జీవితంలో ఇంత అద్భుతమయిన ఘట్టం తనకు ఎదురవుతుంది అని.అదే అంటున్నాడు.ఓ ధృతరాష్ట్ర మహారాజా!శ్రీ వ్యాస భగవానుడి దయ వలన యోగేశ్వరుడు అయిన శ్రీకృష్ణుడు సొంతంగా,స్వమపఖంగా అర్జునుడికి చెప్పిన యోగశాస్త్రము అయిన గీతోఽపదేశాన్ని ప్రత్యక్షంగా విని,తరించే భాగ్యం నాకు కలిగింది.నాకు ఇంక జీవితంలో ఇంకేమీ వద్దు.ఈ అదృష్టం చాలు.

No comments:

Post a Comment