Sunday, 14 September 2025

ఇదం తే నాతపస్కాయ

ఇదం తే నాతపస్కాయ నాభక్తాయ కదాచన। న చాశుశ్రూషవే వాచ్యం న చ మాం యోఽభ్యసూయతి॥67॥ శ్రీమద్భగవద్గీత...అష్టాదశాధ్యాయము మోక్ష సన్న్యాస యోగము శ్రీకృష్ణుడు అర్జునుడితో అపాత్రదానం చేయకూడదు అని చెబుతున్నాడు.ఇంత వరకూ చాలా నిగూఢమైన విషయాలు,జ్ఞానం అర్జునుడికి చెప్పాడు కదా!ఇప్పుడు అవి ఎవరికి చెప్పకూడదో చెబుతున్నాడు.నిజమే కదా!పిచ్చోడి చేతికి మంత్ర దండం ఇస్తే ఏమి చేస్తాడు?దురుపయోగంచేస్తాడు.దానిని అపహాస్యం చేస్తాడు.దాని విలువ తగ్గిస్తాడు.నవ్వులపాలు చేస్తాడు.నవ్వుల పాలు అవుతాడు.ముఖ్యంగా అందరికీ హానీ,అన్యాయం చేస్తాడు.అందుకే శ్రీకృష్ణుడు అర్జునుడికి మెళకువలు చెబుతున్నాడు.హే అర్జునా!నేను నీకు ఇప్పుడు చేసిన హితబోధను అపహాస్యం చేయవద్దు.జపము,తపము చేయని వారికి చెప్పవద్దు.నా భక్తుడు కాని వాడికి చెప్పవద్దు.సేవాధర్మం పాటించని వాడికి చెప్పవద్దు.నన్ను అర్థం చేసుకోకుండా అసూయతో చూసేవాడికి,అపహాస్యం చేసేవాడికి,తప్పుగా అర్థం చేసుకునేవాడికి ఈ శాస్త్రాన్ని ససేమిరా బోధించవద్దు.ఎందుకంటావా?నీ శ్రమ అంతా బూడిదలో పోసిన పన్నీరు అవుతుంది.వృథా అవుతుంది.

No comments:

Post a Comment