Friday, 1 August 2025

యయాతు ధర్మకామార్థాన్

యయాతు ధర్మకామార్థాన్ ధృత్యా ధారయతేఽర్జున। ప్రసంగేన ఫలాకాంక్షీ ధృతి స్సా పార్థ!రాజసీ॥34॥ శ్రీమద్భగవద్గీత....అష్టాదశాధ్యాయము మోక్ష సన్న్యాస యోగము శ్రీకృష్ణుడు అర్జునుడితో అంటున్నాడు.హే పార్థా!హే అర్జునా!మనము ఇప్పుడు మనో ఇంద్రియ నిగ్రహణ సాత్త్విక ధృతి అని మాట్లాడుకున్నాము కదా!అలాగే రాజస ధృతి గురించి నీలో అవగాహన పెంచుతాను,విను.ఇక్కడ అంతా పంతాలు,పట్టింపులు ఎక్కువగా,ప్రధాన పాత్ర వహిస్తాయి.ఈ పని చేస్తే లాభం ఎంత?ప్రతిఫలం మొత్తం నాకే దక్కుతుందా?లేక ఇతరులతో పంచుకోవాలా?అంతా చేస్తే నాకేంటి?అనే భావజాలం ఎక్కువ కనిపిస్తుంది.ధర్మార్ధకామాల యందు అధికంగా పట్టుదల ఉంటుంది.దానం చేస్తే ఎంత పుణ్యం వస్తుంది?ధర్మం చేస్తే నాకేమి గిట్టుబాటు అవుతుంది?అంటే చేసే ప్రతి పనిలో లాభనష్టాల బేరీజు వేసుకుంటూ,ముందుకు పోతుంటారు.ఇలా అహంభావంతో,పట్టుదలలతో ఆలోచించడమే రాజస ధృతి.

No comments:

Post a Comment