Saturday, 2 August 2025

యయా స్వప్నం భయం శోకం

యయా స్వప్నం భయం శోకం విషాదం మదమేవ చ। న విముంచతి దుర్మేధా ధృతి స్సా పార్థ!తామసీ॥35॥ శ్రీమద్భగవద్గీత..అష్టాదశాధ్యాయము మోక్ష సన్న్యాస యోగము శ్రీకృష్ణుడు అర్జునుడికి సాత్త్విక ధృతి,రాజస ధృతి గురించి చెప్పాడు.ఇంక మిగిలింది తామస ధృతి కదా!దాని గురించి చెప్పడం మొదలు పెట్టాడు.హే పార్థా!హే అర్జునా!నేను నీకు చెప్పిన సాత్త్విక,రాజస ధృతులు బాగా అర్థం అయ్యాయి కదా!ఇంక ఇప్పుడు తామస ధృతి గురించి చర్చించు కుందాము.ఇక్కడ ముఖ్యంగా మూర్ఖపు పట్టుదలలు కానవస్తుంటాయి.ఒక విషయాన్ని సవ్యంగా ఆకళింపు చేసుకునే సమన్వయం అసలే ఉండదు.స్వప్నం,భయం,శోకం,విషాదం,గర్వం...ఇలా ఒకటి కాదు,సవా లక్ష కారణాలకు చలిస్తూ,ప్రభావితమవుతుంటారు.సానుకూల స్పందన కరవౌతుంటుంది.ఇన్ని అపసవ్యాలు ఉన్నా కూడా,తమ తమ మూర్ఖపు పట్టుదలలను వదిలి పెట్టరు.ఇలాంటి దాన్నే తామస ధృతి అంటారు.

No comments:

Post a Comment