Tuesday, 5 August 2025

విషయేంద్రియ సంయోగాత్

విషయేంద్రియ సంయోగాత్ యత్తదగ్రేఽమృతోపమం। పరిణామే విషమివ తత్సుఖం రాజసం స్మృతమ్॥38॥ శ్రీమద్భగవద్గీత..అష్టాదశాధ్యాయము మోక్ష సన్న్యాస యోగము శ్రీకృష్ణుడు అర్జునుడికి సాత్త్విక సుఖం గురించి చెప్పాడు.ఇప్పుడు రాజస సుఖం గురించి చెబుతున్నాడు.అర్జునా!మొదట్లో కష్టతరంగా ఉండి,నిరంతర సాధనతో అనంతమయిన ఆనందాన్ని ఇచ్చేది సాత్త్విక సుఖం అని చెప్పాను కదా!ఇప్పుడు రాజస సుఖం గురించి మాట్లాడుకుందాము.రాజస సుఖం అనేది ప్రధానంగా ఇంద్రియ సంయోగం వలన పుడుతుంది.మొదట అంతా రంజుగా,అమృత తుల్యంగా ఉంటుంది.కానీ,పోనుపోను విషతుల్యంగా మారుతుంది.కాబట్టి తస్మాత్ జాగ్రత్త!

No comments:

Post a Comment