Thursday, 7 August 2025

న తదస్తి పృథివ్యాం వా

న తదస్తి పృథివ్యాం వా దివి దేవేషు వా పునః। సత్త్వం ప్రకృతి జైర్ముక్తం యదేభిస్స్వా త్రిభిర్గుణైః॥40॥ శ్రీమద్భగవద్గీత...అష్టాదశాథ్యాయము మోక్ష సన్న్యాస యోగము శ్రీకృష్ణుడు అర్జునుడికి చెబుతున్నాడు.అర్జునా!ప్రతి విషయానికీ నేను సాత్త్విక,రాజస,తమోగుణాలు,భావాలు,సుఖాలు అంటూ చెబుతున్నాను.అంటే ఈ భూమి పైన పుట్టిన ప్రతిజీవీ ఈ మూడింటిలోని ఏదో ఒక చట్రంలో ఇమిడి ఉంటుంది.ఎందుకంటే ఇవన్నీ ప్రకృతి వల్ల పుట్టిన గుణాలు.ఇవేవీ కాకుండా,వీటికి అతీతంగా ఏదీ కూడా ఎక్కడా మనకు కానరాదు.ఈ పరిస్థితి ఒక్క భూలోకంలోనే కాదు,స్వర్గలోకంలో,దేవతలలో కూడా కనిపిస్తుంది.

No comments:

Post a Comment