Tuesday, 19 August 2025

వివిక్తసేవీ లఘ్వాసీ

వివిక్తసేవీ లఘ్వాసీ యతవాక్కాయమానసః। ధ్యానయోగపరో నిత్యం వైరాగ్యం సముపాశ్రితః॥52॥అహంకారం బలం దర్పం కామం క్రోధం పరిగ్రహమ్। విముచ్య నిర్మమశ్శాంతో బ్రహ్మభూయాయ కల్పతే॥53॥ బ్రహ్మభూతః ప్రసన్నాత్మా న శోచతి న కాంక్షతి। సమస్సర్వేషు భూతేషు మద్భక్తిం లభతే పరామ్॥54॥ శ్రీమద్భగవద్గీత..।అష్టాదశాధ్యాయము మోక్ష సన్న్యాస యోగము శ్రీకృష్ణుడు అర్జునుడికి ఓపికగా చెబుతున్నాడు.అర్జునా!నీ కోసం మళ్ళీ మళ్ళీ చెబుతున్నాను.సావథానంగా విని,బుర్రలోకి ఎక్కిచ్చుకో!బ్రహ్మభావానికి అర్హత ఏమేమి అని చెప్పాను?మాయా మోహం లేకుండా,నిశ్చల జ్ఞానంతో మనసును నిగ్రహించాలని చెప్పాను కదా!అలాగే శబ్దాది విషయలను వదలి,రాగద్వేష రహితంగా,విరాగిగా,యేకాంతంగా,అల్పాహారిగా,మనోవాక్కాయ కర్మలను నియమబద్థం చెయ్యాలని చెప్పాను కదా!అహంకారము,దురభిమానము,దంభం,కామక్రోధాలు,మమకారాలకు దూరంగా,అతీతంగా ఉండాలని నొక్కి వక్కాణించాను కదా! అర్జునా!ఇదంతా ఇన్ని సార్లు ఎందుకు చెబుతున్నానో అర్థం చేసుకో!బ్రహ్మ భావాన్ని ఒకసారి పొందితే,అంతఃకరణం శుద్ధి అవుతుంది.కాబట్టి మనిషి ఇంకేమీ కోరడు.దేనికీ దుఃఖ పడడు.సమస్త ప్రాణులయందూ సమ దృష్టి కలిగి ఉంటాడు.చివరకు జ్ఞానయోగ ఫలంగా నా భక్తిని,ముక్తిని పొందుతాడు.

No comments:

Post a Comment