Saturday, 9 August 2025

శమో దమ స్తప శ్శౌచం

శమో దమ స్తప శ్శౌచం క్షాంతి రార్జవమేవ చ। జ్ఞానం విజ్ఞానమాస్తిక్యం బ్రహ్మకర్మ స్వభావజమ్॥42॥ శ్రీమద్భగవద్గీత...అష్టాదశాధ్యాయము మోక్ష సన్న్యాస యోగము శ్రీకృష్ణుడు అర్జునుడికి వివిధ వర్ణాలకు సంబంధించిన కర్మల గురించి వివరించేదానికి ఉపక్రమించాడు.అర్జునా!స్వభావ సిద్ధమయిన గుణాలననుసరించి వివిధ వర్ణాలుగా విభజన జరిగింది అని చెప్పాను కదా!ఇప్పుడు వారికి నిర్దేశించిన కర్మలను చెబుతాను,విను.ఇంద్రియ (పంచేంద్రియాలు,మనసు)నిగ్రహణ,తపస్సు,శౌచం,క్షమ,ఋజు వర్తనం,శాస్త్ర జ్ఞానం,అనుభవ జ్ఞానం,ఆస్తిక్యత ....ఇలాంటి మంచి గుణాలు,సంపత్తులు స్వభావతః బ్రాహ్మణ కర్మలు.మన మనసు,మాట,కర్మలు అన్నీ ఒకే తాటి పైన ఉండడమే ఋజు వర్తనము అంటే.మనలో దేవుని ఉనికి పైన విశ్వాసము,ఇహ పర లోకాల గురించిన అవగాహనలను ఆస్తిక్యము అని అంటారు.శౌచము అనేది అందరికీ చాలా ముఖ్యమయినది.ఎందుకంటే ధర్మదేవతకు ఉన్న నాలుగు పాదాలలో శౌచము ఒకటి అని ధర్మరాజు చెప్పాడు.శౌచం అంటే శుచి,శుభ్రత అని అర్ధము.మన పరిసరాలు ఒక్కటే కాదు,మన శరీరాన్ని,మనసును,మన చుట్టూ ఉన్న సమాజాన్ని కూడా శుభ్రంగా ఉంచుకోవాలి.

No comments:

Post a Comment