Sunday, 17 August 2025

సిద్ధిం ప్రాప్తో యథా బ్రహ్మ

సిద్ధిం ప్రాప్తో యథా బ్రహ్మ తధాఽఽప్నోతి నిబోధ మే। సమాసేనైవ కౌంతేయ!నిష్ఠా జ్ఞానస్య యాపరా॥50॥ శ్రీమద్భగవద్గీత..।అష్టాదశాధ్యాయము మోక్ష సన్న్యాస యోగము శ్రీకృష్ణుడు అర్జునుడికి వివరిస్తున్నడు.హే కౌంతేయ!హే అర్జునా!నేను నైష్కర్మ్య సిద్ధి అనగానే నీకు అర్థం కాలేదు అని నాకు అర్ధం అయింది.కామక్రోథ మద లోభాలకు అతీతంగా మనము ఆచరించ వలసిన పనులు మనము చేయటమే నిష్కామ కర్మ అని అంటారు.అలా కర్మానుష్టానం చేయటం వలన సిద్ధిని పొందగలతాము.ఇలా జ్ఞాన సిద్ధిని పొందిన వాడు యే విధంగా పరమాత్మను పొందుతాడో నీకు సవివరంగా చెబుతాను.

No comments:

Post a Comment