Friday, 15 August 2025

సహజం కర్మ కౌంతేయ

సహజం కర్మ కౌంతేయ సదోషమపి స త్యజేత్। సర్వారంభా హి దోషేణ ధూమేనాగ్ని రివావృతాః॥48॥ శ్రీమద్భగవద్గీత.।।అష్టాదశాధ్యాయము మోక్ష సన్న్యాస యోగము శ్రీకృష్ణుడు అర్జునుడికి వివరిస్తున్నాడు.దోషాలతో కూడుకున్నా మన స్వధర్మాన్ని మనం వదిలి పెట్టకూడదు అని చెప్పాడు కదా.అర్జునుడు అర్ధం కానట్లు బిక్క మొహం వేసాడేమో! హే అర్జునా!హే కౌంతేయా!నేను మళ్ళీ మళ్ళీ చెబుతున్నాను.సహజకర్మలు,స్వధర్మాలు దోషాలతో ఉన్నా మనము ఎప్పుడూ విడిచి పెట్టకూడదు.ఎందుకు అని అడుగుతావా?చెబుతాను,విను.నిప్పు రాజెయ్యాలంటే,మొదలు మొదలు పొగ వస్తుంది కదా!అగ్ని నిలకడగా వ్యాపించేదాకా ఆ పొగ ఉంటుంది కదా!కట్టెలు పచ్చివి అయినా,సరిగ్గా రాజుకోక పోయినా పొగ ఉంటుంది కదా!అగ్ని పొగతో ఉన్నట్లుగానే సర్వధర్మాలూ ఏదో ఒక దోషంతో ఆవరింపబడి ఉంటాయి.కాబట్టి ఎంత సేపూ తప్పొప్పులు,దోషాలు వెతకకుండా,స్ధూలంగా జరిగే మంచికి ప్రాముఖ్యం ఇవ్వాలి.

No comments:

Post a Comment