Wednesday, 20 August 2025

భక్త్యా మామభిజానాతి

భక్త్యా మామభిజానాతి యావాన్యశ్చాస్మి తత్త్వతః। తతో మాం తత్త్వతో జ్ఞాత్వా విశతే తదనంతరమ్॥55॥ శ్రీమద్భగవద్గీత..।అష్టాదశాధ్యాయము మోక్ష సన్న్యాస యోగము శ్రీకృష్ణుడు అర్జునుడికి వివరిస్తున్నాడు.అర్జునా!నీకు ఇంత దూరం,ఇంత విపులంగా ఎందుకు చెబుతున్నానో తెలుసా?నా భక్తిని పొందగలగటం ఆషామాషీ వ్యవహారంకాదు!జ్ఞానయోగ ఫలమయిన నా భక్తిని పొందినవాడు నా స్వరూప స్వభావాలను పూర్తిగా ఆకళింపు చేసుకుంటాడు.చివరకు ఆ భక్తి తత్త్వంలోనే మునుగి,తేలుతూ నాలో ఐక్యం అవుతాడు.మానవ జన్మకు అంతకంటే ఉత్కృష్టమయినది ఇంకేమి ఉంటుంది?పరమాత్మతో మమేకం కావటం అంటే మాటలా!!!!

No comments:

Post a Comment