Sunday, 24 August 2025

ఈశ్వర స్సర్వభూతానాం

ఈశ్వర స్సర్వభూతానాం హృద్దేశేఽర్జున తిష్ఠతి। భ్రామయన్ సర్వభూతాని యంత్రారూఢాని మాయయా॥61॥ శ్రీమద్భగవద్గీత..।అష్టాదశాధ్యాయము మోక్ష సన్న్యాస యోగము శ్రీకృష్ణుడు అర్జునుడితో ఇలా అంటున్నాడు.ఓ అర్జునా!దేవుడు ఎక్కడ ఉన్నాడు? ఎక్కడ లేడు? ఇలాంటి అనుమానాలు నీకు అస్సలు వద్దు.ఈశ్వరుడు సర్వాంతర్యామి.తన మాయ చేత సర్వభూతాలనూ కీలు బొమ్మల్లా ఆడిస్తాడు.ఆయన అన్ని ప్రాణుల హృదయాంతరాళలో సదా నివసిస్తూ ఉంటాడు.మామూలు మనుష్యులు మాయామోహంతో అంతర్ముఖంగా ఉండే ఆయనను గుర్తించలేరు.అలా కనుక్కోవాలంటే సాథన కావాలి.

No comments:

Post a Comment