Wednesday, 13 August 2025

యతః ప్రవృత్తిర్భూతానాం

యతః ప్రవృత్తిర్భూతానాం యేన సర్వమిదం తతమ్। స్వకర్మణా తమభ్యర్చ్య సిద్ధింవిందతి మానవః॥46॥ శ్రీమద్భగవద్గీత..।అష్టాదశాధ్యాయము మోక్ష సన్న్యాస యోగము శ్రీకృష్ణుడు అర్జునుడికి సావధానంగా వివరిస్తున్నాడు.అర్జునా!ఇంత సేపూ నేను స్వాభావిక కర్మల ఆచరణ గురించి చెప్పాను కదా!దాని వల్ల లాభం కూడా చెబుతాను విను.ఈ లోకంలో అన్ని ప్రాణులను ఎవరు పుట్టిస్తారు?వాళ్ళ ఎదుగుదల,కర్మలను,లయాన్ని ఎవరు నిర్దేశిస్తారు?ఎవరు ఈ ముల్లోకాలనూ నిండి ఉన్నాడు?ఆ పరమాత్మయే కదా! మానవుడు తనకు విధింపబడిన కర్మల ద్వారా ఆ పరమాత్మను ఆరాధన చెయ్యాలి.అలా చేస్తే ప్రతి ఒక్కరూ చిత్తశుద్ధిని పొందుతారు.అలాగే కైవల్యాన్నీ పొందుతారు.

No comments:

Post a Comment