Tuesday, 12 August 2025

స్వే స్వే కర్మణ్యభిరతః

స్వే స్వే కర్మణ్యభిరతః సంసిద్ధిం లభతే నరః। స్వకర్మనిరత స్సిద్ధిం యథా విందతి తచ్ఛృణు॥45॥ శ్రీమద్భగవద్గీత..।అష్టాదశాధ్యాయము మోక్ష సన్న్యాస యోగము శ్రీకృష్ణుడు అర్జునుడితో ఇలా అంటున్నాడు.అర్జునా!నేను ఇప్పుడు నీకు మూడు రకాల కర్మల గురించి చెప్పాను కదా!దాని వల్ల ఏమి అర్థం అవుతుంది?అంటే మనము మన మన స్వభావ సిద్థమైన కర్మల పట్ల శ్రద్ధాసక్తులు కనబరచాలి.వాటికి అనుగుణంగా,ప్రతిఫలాపేక్షను వదలి ప్రవర్తించాలి.అలా ప్రవర్తించే ప్రతి మానవుడూ జ్ఞానమును సమకూర్చుకుంటాడు.అలాగే సిద్ధి,బుద్ధి పొందుతాడు.ఇందులో లేశమాత్రము అయినా అనుమానము లేదు.మోక్షానికీ,కైవల్యానికీ ఇదే మార్గము.

No comments:

Post a Comment