Monday, 4 August 2025

సుఖం త్విదానీం త్రివిధం

సుఖం త్విదానీం త్రివిధం శృణు మే భరతర్షభ। అభ్యాసా ద్రమతే యత్ర దుఃఖాంతం చ నిగచ్ఛతి॥36॥ యత్తదగ్రే విషమివ పరిణామేఽమృతోపమం। తత్సుఖం సాత్త్వికం ప్రోక్తం ఆత్మబుద్ధి ప్రసాదజమ్॥37॥ శ్రీమద్భగవద్గీత..।అష్టాదశాధ్యాయము మోక్షసన్న్యాస యోగము శ్రీకృష్ణుడు అర్జునుడికి ఓపికగా మూడు రకాలు అయిన ధృతుల గురించి వివరించాడు.ఇప్పుడు ఇంక మూడు రకాల సుఖాలను గురించి వివరించేదానికి సమాయత్తం అయ్యాడు. హే భరత శ్రేష్టా!హే అర్జునా!నీకు ధృతి అంటే ఏమిటి?దానిలో రకాలు బాగా అర్థముఅయ్యాయి కదా!మనము ఇప్పుడు సుఖాలు,వాటిల్లో రకాలు గురించి చర్చించుకుందాము.నీకు ఎక్కడ అయినా అనుమానం వస్తే సంశయ నివృత్తి చేసుకో! సుఖాలు స్థూలంగా మూడు రకాలు.వాటిల్లో మొదట నీకు సాత్త్విక సుఖం గురించి వివరిస్తాను.ఇది మొదట్లో విషతుల్యంగా ఉంటుంది.దుఃఖ భాజకంగా కూడా ఉంటుంది.ఇంత కష్టం,ఇంత నష్టం అవసరమా ?అని కూడా అనిపిస్తుంది.కానీ అభ్యాసం చేసేకొద్దీ సులభతరమవుతుంది.తినగ తినగ వేప తియ్యనగును అంటారు కదా!అలాగ!మనము మొదట్లో కష్టము,బాధాజనకము,దుఃఖ కారకము అనుకునేవి...చిన్న చిన్నగా అభ్యాసం చేసే కొద్దీ సులభతరం అవుతూ వస్తాయి.ఒకటొకటిగా ఇబ్బందులు తొలగి పోతుంటాయి.చివరకు వచ్చేటప్పటికి ఎనలేని ఆనందాన్నీ,ఆత్మ తృప్తినీ ఇస్తాయి.ఆ అమృతమయము అయిన బుద్ధితో జన్మించేదే సాత్త్విక సుఖము.

No comments:

Post a Comment