Friday, 22 August 2025

మచ్చిత్త స్సర్వదుర్గాణి మత్ప్రసాదా

మచ్చిత్త స్సర్వదుర్గాణిమత్ప్రసాదా త్తరిష్యసి। అథ చేత్త్వమహంకారాత్ న శ్రోష్యసి వినంక్ష్యసి॥58॥ శ్రీమద్భగవద్గీత..।అష్టాదశాధ్యాయము మోక్ష సన్న్యాస యోగము శ్రీకృష్ణుడు అర్జునుడికి ఇంకా ఇంకా ఓపికగా చెబుతున్నాడు.ఓ అర్జునా!నిన్ను భయపెట్టేదానికి గానీ,బెదించేదానికి గానీ నేను ఇవేవీ చెప్పటం లేదు.విత్య సత్యాలు కాబట్టే చెబుతున్నాను.కాబట్టి మనసు పెట్టివిని,అర్థం చేసుకో!మామూలుగా ఈ మానవ మాత్రులు భవ సాగరం దాటాలంటే ససేమిరా కాని పని.కాబట్టి నా శరణు కోరుకో!నేను కరుణిస్తేనే, దాటశక్యం కాని సంసార దుఃఖాలన్నింటినీ సులువుగా దాటగలవు.కాదు నాకు అఖ్ఖరలేదు నీ ఆపన్నహస్తం అని గర్వానికీ,అహంభావానికీ పోతే నాశనం అవుతావు.దానిని ఎవరూ ఆపలేరు.

No comments:

Post a Comment