Tuesday, 5 August 2025

యదగ్రే చానుబంధే చ

యదగ్రే చానుబంధే చ సుఖం మోహన మాత్మనః। నిద్రాలస్య ప్రమాదోత్థం తత్తామస ముదాహృతమ్॥39॥ శ్రీమద్భగవద్గీత...అష్టాదశాధ్యాయము మోక్ష సన్న్యాస యోగము శ్రీకృష్ణుడు అర్జునుడికి సాత్త్విక,రాజస సుఖాల గురుంచి వివరించాడు.ఇంక తామస సుఖం మిగిలి ఉంది.ఇలా చెబుతున్నాడు.అర్జునా!నీకు సాత్త్విక,రాజస సుఖాలు బాగా అర్థం అయ్యాయి కదా!ఇంక తామస సుఖం గురించి చెప్పుకుందాము.ఇక్కడ మొదలు,ఆఖరు... అంతా మోహజనకంగా ఉంటుంది.నిద్ర,అలసత్త్వము,ప్రమాదాలతో కూడుకుని ఉంటుంది.ఎక్కడా ప్రశాంత చిత్తంతో,ఆలోచించి చేయడం అనే ప్రణాలిక,మనసు,తెలివి ఉండవు.ఇలా అడ్డూ,ఆపూ లేకుండా,విచక్షణా రహితంగా పొందే సుఖాన్నే తామస సుఖం అని అంటారు.ఇది ఆఖరుకు దుఃఖభాజనము అవుతుంది.

No comments:

Post a Comment