నాసతో విద్యతే భావో నాభావో విద్యతే సతః।
ఉభయోరపి దృష్టోఽన్త స్త్వనయో స్తత్త్వదర్శిభిః॥16॥2॥
శ్రీమద్భగవద్గీత...సాంఖ్య యోగము...
శ్రీకృష్ణుడు అర్జునుడి బుర్రలోకి తాను చెప్పేది ఎక్కాలని చాలా తాపత్రయపడుతున్నాడు.ఇలా చెబుతున్నాడు.అర్జునా!ఇటు చూడు.దేహం కలిగిన వారు అందరూ అశాశ్వతులు.ఆత్మ శాశ్వతము.దానికి లేమి అనేది లేనే లేదు.దేహాదులు అంతా మాయ,అశాశ్వతము.అదే ఆత్మ అనేది నిత్యమూ,సత్యమూ అయినది.ఇది అర్థం చేసుకో ముందు.
ఈ విషయాన్ని తత్త్వజ్ఞులందరూ ఎప్పుడో తెలుసుకున్నారు.ఇది నిశ్చలమయిన,నిశ్చితమయిన సత్యము.దీనినుంచి ఎవరూ మొహం చాటు వేయలేరు.ఒప్పుకోవాలసిందే!
No comments:
Post a Comment