Sunday, 8 February 2026
న త్వేవాహం జాతు నాసం
న త్వేవాహం జాతునాసం న త్వం నేమే జనాధిపాః।
న చైవ న భవిష్యామ స్సర్వే వయ మతః పరమ్॥11॥2॥
శ్రీమద్భగవద్గీత...సాంఖ్య యోగము...
చిన్న పిల్లోడికి ఏమైనా అర్ధం కాకపోతే వేరేవాళ్ళు విసుక్కోవచ్చు.కానీ అమ్మ ఏం చేస్తుంది?పిల్లవాడిని భయపెట్టకుండా,మంచిగా,చిన్నగా,సులభంగా అర్థం అయ్యేలాగా,వాడి బుర్రకు తగినట్లు మంచిగా ప్రేమగా చెబుతుంది కదా!కృష్ణుడు కూడా ఇక్కడ అర్జునుడిని భయపెట్టడం లేదు.ఇంకా సందిగ్ధంలోకి నెట్టడం లేదు.ప్రశాంత చిత్తంతో,ఓపికగా,అర్ధం అయ్యేలా చెబుతున్నాడు.
అర్జునా!సఖా!నీవు ఏదో గందరగోళంలో గాబరా పడుతున్నావు.నీవు అనుకునేది ఏమీ లేదు.అంతా చాలా సునాయసంగా అర్ధం అయ్యేదే!నా మాట నమ్ముతావా?
నేను,నువ్వు,నీవు చెప్పే ఈ మహారాజులు అందరూ గతంలో లేకుండా లేము.అట్లాగా అని భవిష్యత్తులో ఉండకుండా పోము.ఇప్పుడు ఉన్నాము అనే విషయం లో నీకు ఎలాంటి అనుమానం లేదు కదా!
అంటే ఇది అంతా కాలచక్రం.పుడుతుంటాము,గిట్టుతుంటాము.ఎప్పుడూ ఇలానే కాలం సాగిపోతుంది.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment