Saturday, 21 February 2026
అవ్యక్తోఽయ మచింత్యో
అవ్యక్తోఽయ మచింత్యోఽయ మవికార్యో య ముచ్యతే
తస్మాదేవం విది త్వైనం నాను శోచితు మర్హసి॥25॥2॥
శ్రీమద్భగవద్గీత...సాంఖ్య యోగము....
శ్రీకృష్ణుడు అర్జునుడికి ఆత్మ గురించి ఇంకా చెబుతున్నాడు.
అర్జునా!ప్రియ సఖా!ఆత్మని కాల్చలేము,తడపలేము,ఎండబెట్టలేము,చంపలేము అని చెప్పాను కదా!
అది మన పంచేంద్రియాలకు కూడా కానరాదు.అంటే మనము తాకలేము,వినలేము,వాసన గ్రహించలేము,రుచి చూడలేము,చూడలేము,మాటలాడలేము.ఈ ఆత్మ ఇలా ఉంటుంది!అలా ఉంటుంది అని చెప్పలేము.అసలు ఎలా ఉంటుంది అని ఊహించను కూడా ఊహించలేము.దీనికి ఆకారం లేదు,ఆహార్యం అసలే లేదు.అంటే నూటికి నూరు పాళ్ళూ నిర్వికారి.
ఇది ఇప్పుడు నేను నీకు చెప్పడం కాదు.అనాది నుంచీ ఆత్మ గురించి చెప్పబడే విషయాలే.ముందర ఈ ఆత్మ తత్త్వాన్ని నువ్వు తెలుసుకో,అర్థం చేసుకో.ఇంతకు మించి ఇంకొక మార్గం లేదు.ఈ విషయం నువ్వు ఆకళింపు చేసుకుంటే దుఃఖం అనేది నీ చుట్టు ప్రక్కలకు కూడా రాదు.ఆమడ దూరంలో ఎక్కడో బ్రతుకు జీవుడా అంటూ నిట్టూరుస్తూ,వణుకుతూ ఉంటుంది.నన్ను నమ్ము.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment