Monday, 9 February 2026
దేహినోఽస్మిన్ యథాదేహే
దేహినోఽస్మిన్ యథాదేహే కౌమారం యౌవనం జరా।
తథా దేహాంతర ప్రాప్తిః ధీర స్తత్ర న ముహ్యతి॥13॥2॥
శ్రీమద్భగవద్గీత....సాంఖ్య యోగము...
శ్రీకృష్ణుడు ముందర అర్జునుడిని స్వాంతపరుస్తున్నాడు.చిన్నగా,అనునయంగా,ప్రేమగా చెబుతున్నాడు.
అర్జునా!నేను ఎందుకు అందరమూ అన్ని కాలాలోనూ ఉంటాము అని చెబుతున్నానో గ్రహించేదానికి ప్రయత్నం చెయ్యి.మనకు ఈ శరీరం ఉంది కదా!దానివలన సహజంగా ఈ దేహానికి బాల్యం,యవ్వనము,ముసలితనము కలుగుతాయి కదా!అది నువ్వుకూడా ఒప్పుకుంటావు కదా!ఇలాగే మరో దేహాన్ని పొందడం కూడా ఇంతే సహజం.బుద్దిమంతులు సులువుగా ఈ విషయాన్ని గుర్తిస్తారు.కలవరపడరు.మోహితులు అస్సలేకారు.స్థితప్రజ్ఞత కనబరుస్తారు.నువ్వుకూడా అర్థం చేసుకుని,సమన్వయం చూపించు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment