Sunday, 1 February 2026
తమూవాచ హృషీకేశః
తమూవాచ హృషీకేశః ప్రహసన్నివ భారత।
సేనయో రుభయో ర్మధ్యే విషీదంత మిదం వచః॥10॥2॥
శ్రీమద్భగవద్గీత...సాంఖ్య యోగము
సంజయుడు ధృతరాష్ట్ర మహారాజుకు ఈ విథంగా వివరిస్తున్నాడు.ఓ ధృతరాష్ట్ర మహారాజా!అర్జునుడు చాలా దీనంగా కనిపిస్తున్నాడు.రెండు సైన్యాల మధ్య అతను విషణ్ణ వదనంతో చాలా వ్యాకులంగా,నిశ్చేష్టుడు అయి రధం పైన పడిఉన్నాడు.చూసేవారికి అంతా చాలా హృదయవిదారకంగా ఉంది అతని స్థితి,పరిస్థితి.కానీ అతని బాల్య మిత్రుడు శ్రీకృష్ణుడుకు మటుకు పట్టలేనంత నవ్వుగా ఉంది.పగలబడి పెద్దగా నవ్వడం మొదలుపెట్టాడు.నవ్వుతూనే ఇలా అన్నాడు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment