నైనం ఛిందంతి శస్త్రాణి నైనం దహతి పావకః।
న చైనం క్లేదయం త్యాపో న శోషయతి మారుతః॥23॥2॥
శ్రీమద్భగవద్గీత...సాంఖ్య యోగము....
శ్రీకృష్ణుడు అర్జునుడికి ఇంకా ఇలా చెబుతున్నాడు.అర్జునా!ఈ ఆత్మ అనేది ఉందే.దీనిని ఎవరూ ఏమీ చేయలేరు.ఎలాంటి అస్త్ర శస్త్రాలూ దీనిని ఛేదించలేవు,భేదించ లేవు.ఎంతటి అగ్ని కూడా దీనిని దహించలేదు.ఎక్కడి నుంచి ఎన్ని సముద్రాల నీరు తెచ్చి పోసినా తడపలేము.అది తడవదు.ఎలాంటి భీకరమయిన గాలులు కూడా దానిని ఆరబెట్టలేవు.ఎండబెట్టలేవు.మనము దానిని ఏమీ చేయలేము.అన్నిటికీ అతీతము.
No comments:
Post a Comment