Tuesday, 17 February 2026
వాసాంసి జీర్ణాని
వాసాంసి జీర్ణాని యథా విహాయ
నవాని గృహ్ణాతి నరోఽపరాణి।
తథా శరీరాణి విహాయ జీర్ణా
న్యన్యాని సంయాతి నవాని దేహీ॥22॥2॥
శ్రీమద్భగవద్గీత...సాంఖ్య యోగము...
బుజ్జోడి బుల్లి బొజ్జలోకి బజ్జి బువ్వ పోవాలంటే అమ్మ బహు ప్రయాస పడుతుంది కదా!ఇక్కడ మన కన్నయ్య కూడా అర్జునుడి బుర్రలోకి కూసింత జ్ఞానం ఎక్కించేదానికి కడు కటకటలు పడుతున్నాడు.
అర్జునా!మనము మన బట్టలు చినిగి పోతే ఏమి చేస్తాము?అట్లనే చీలికలు,పేలికలు వేసుకుని తిరగము కదా!వాటిని తీసి పారేస్తాము కదా!మంచిగా క్రొత్త బట్టలు వేసుకుని టింగురంగా అంటూ తిరుగుతాము కదా!
ఆత్మ కూడా అచ్ఛం అలానే ఆలోచిస్తుంది,చేస్తుంది.ఈ శరీరం నిరుపయోగమవుతుందనుకో!ఈ పనికిరాని పాత శరీరం విడిచి పెడుతుంది మొహమాటం లేకుండా!ఎంచక్కా క్రొత్త దేహంలోకి ప్రవేశిస్తుంది ఎంతో సహజంగా,సునాయాసంగా!
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment