Saturday, 28 February 2026
అకీర్తిం చాపి భూతాని
అకీర్తిం చాపి భూతాని కథయిష్యంతి తేఽవ్యయామ్।
సంభావితస్య చాకీర్తిః మరణా దతిరిచ్యతే॥34॥2॥
శ్రీమద్భగవద్గీత...సాంఖ్య యోగము....
శ్రీకృష్ణుడు అర్జునుడిని కొంచెం బెదిరించి,ఇంకొంచెం నచ్చ జెప్పే ప్రయత్నం చేస్తున్నాడు.సన్నిహితుడి హితము కోరినపుడు సహేతుకమయిన మార్గాలు అన్నీ వెదకాలికదా!ప్రయోగించాలి కదా!
అర్జునా!నీవు పెద్ద వీరుడివి.అలాంటిది చేతులు ముడుచుకుని యుద్ధం చేయకుండా మొహం చాటేస్తే లోకం ఏమనుకుంటుంది?నీవు చెప్పే కాకమ్మ కబుర్లు,శాంతి సూత్రాలు అసలు కారణం అని నమ్ముతుంది అని ఆశ పడుతున్నావా?ముమ్మాటికీ లోకం అలా ఆలోచించదు.నీవు పిరికి పందవి అని ముద్ర వేస్తుంది.ఓటమికి భయపడి అస్త్ర సన్యాసం చేసావు అంటుంది.ఈ అపకీర్తి నీవు పోయినా పోదు.ప్రజలు కథలు కథలుగా నీ చేతకానితనం అని అభివర్ణిస్తారు.నీవు అభిమాన ధనుడివి.అలాంటి నీకు ఇలాంటి అపకీర్తి శరాఘాతం కాదా?ఆత్మహత్యాసదృశం కాదా?దానికంటే మరణమే వెయ్యి రెట్టు మేలు కాదా?ఆ అవమానభారం నీవు తట్టుకోగలవా?ఛీత్కారంగా,తుస్కారంగా నీవైపు చూసే చూపులు నీవు నిలువరించగలవా?నీవే తేల్చుకో!
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment