అవినాశి తు తద్విద్ధి యేన సర్వమిదం తతమ్।
వినాశ మవ్యయస్యాస్య న కశ్చి త్కర్తు మర్హతి॥17॥2॥
శ్రీమద్భగవద్గీత...సాంఖ్య యోగము...
శ్రీకృష్ణుడు అర్జునుడికి ఇంకా ఇలా చెబుతున్నాడు.సఖా!అర్జునా!ఈ ఆత్మ అనేది ఉందే!అది ఈ జగత్తు అంతా పరివ్యాప్తమయి ఉంది.అంటే వ్యాపించి ఉంది.దానికి నాశనము లేదు అని తెలుసుకో.ఈ ఆత్మ అవ్యయము.దీనిని నాశనం చేసేది,చేయగలిగేది ముల్లోకాలలో ఏదీ లేదని అర్థం చేసుకో!
అసలు అవ్యయము అంటేనే నాశనము లేనిది.సర్వకాల సర్వావస్థల యందు మార్పులు,చేర్పులు లేకుండా ఉండేది.అది నిత్యమూ,సత్యమూ కూడాను.
No comments:
Post a Comment