Saturday, 28 February 2026
భయా ద్రణా దుపరతం
భయా ద్రణా దుపరతం మంస్యన్తే త్వాం మహారథాః।
యేషాం చ త్వం బహుమతో భూత్వా యాస్యసి లాఘవమ్॥35॥2॥
శ్రీమద్భగవద్గీత...సాంఖ్య యోగము..
శ్రీకృష్ణుడు అర్జునుడికి అద్దం చూపిస్తున్నాడు.అతను యుద్థం చేయక పోతే పరిస్థితి ఎంత దీనంగా ఉండబోతుందో కళ్ళకు కట్టినట్లు వివరిస్తున్నాడు.అయ్యో అర్జునా!జరగబోయేది నీకు అర్థం కావడం లేదు.నీవు ఇప్పుడు యుద్థం చేయకపోతే ఏమవుతుందో నేను చెబుతాను విను.ఇప్పుడు రథులు,అర్థ రథులు,మహారథులు అందరూ నిన్ను ఒక పెద్ద వీరశిరోమణి అని భావిస్తున్నారు.అది కూడా నిజమే అనుకో!కానీ నీవు యుద్థరంగం నుంచి,క్షత్రియ ధర్మం నుంచి మొహం చాటేసిన మరు క్షణం నుంచీ నీ విలువ,గౌరవము అథః పాతాళానికి త్రొక్కి వేయబడతాయి.నీకంటే బలహీనులు కూడా నిన్ను గేలి చేస్తారు,అపహాస్యం చేస్తారు.నిన్ను పిరికివాడిగా చిన్నచూపు చూస్తారు.చులకన చేస్తారు.ఆ అవమానభారం నువ్వు మోయలేవు.తట్టుకోలేవు.నిన్ను గౌరవించి మర్యాద చేసేవాళ్ళు కనుచూపు మేరలో కానరారు.ఇది నిజం.నమ్ము.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment