Sunday, 1 March 2026
అవాచ్య వాదాంశ్చ బహూన్
అవాచ్య వాదాంశ్చ బహూన్వదిష్యంతి తవాహితాః।
నిందంత స్తవ సామర్థ్యం తతో దుఃఖతరం ను కిమ్॥36॥2॥
శ్రీమద్భగవద్గీత...సాంఖ్య యోగము....
శ్రీకృష్ణుడు అర్జునుడికి కఠోర సత్యం వివరిస్తున్నాడు.అర్జునా!మిత్రమా!ప్రతిదీ నీవు అనుకున్నంత సరళం కాదు.నీవు అయిన వాళ్ళను చేజేతులా చంపుకుని పాపం మూటగట్టుకోలేను.దానికంటే అస్త్ర సన్న్యాసం ఎంతో ఉత్తమం అనుకుంటున్నావు.కానీ ప్రపంచం ఏమనుకుంటుందో?ఆ చర్యను ఎలా స్వీకరిస్తుందో నేను నీకు విపులంగా వివరిస్తాను.విను.
నీ శత్రువులు నిన్ను అనరాని మాటల తూటాలతో గాయపరుస్తారు.నీవు పౌరుషం లేని వాడివని ఎద్దేవా చేస్తారు.నీ పరాక్రమాన్ని శంకిస్తారు.చావ లేని వాడు,చావలేనివాడు అని ఎకచకాలాడతారు.గేలి చేస్తారు.చిన్నచూపు చూస్తారు.అవన్నీ నీవు తమాయించుకోలేవు.అంతకంటే దుఃఖ భూయిష్టం,దుఃఖ జనకం ఇంకేమి ఉంటుంది చెప్పు?ఎంత మందికి నీవు వివరణ ఇస్తూ పోతావు?నేను వీరుడు,శూరుడు,విక్రమార్కుడినే!కానీ ఆ సమయంలో శాంతంగా ,సమన్వయంతో,పాపభీతితో,అయినవాళ్ళని పోగొట్టుకోకూడదు అనే సదుద్దేశంతో యుద్ధంనుంచి నిష్క్రమించాను అని.చెప్పినా ఎంత మంది నమ్ముతారు నీ మాటలు?ఆలోచించు బాగా.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment