దూరేణ హ్యవరం కర్మ బుద్ధియోగా ద్ధనంజయ।
బుద్ధౌ శరణ మన్విచ్ఛ కృపణా ఫలహేతవః॥49॥2॥
శ్రీమద్భగవద్గీత...సాంఖ్య యోగము...
శ్రీకృష్ణుడు అర్జునుడికి పదే పదే చెబుతున్నాడు.అర్జునా!నిష్కామ కర్మ,అనగా ప్రతి ఫలాపేక్ష లేకుండా చేసే పనులు,ఎప్పుడూ మంచివే!అదే ప్రతిఫలంకోరి చేసే పనులు హీనమయినవి.అట్లా ప్రతిఫలం కోరి కర్మలు చేసేవాళ్ళు అథములు అవుతారు.నీవు ఆ పనులకు దూరంగా ఉండు.నువ్వు ఆ వర్గంలో చేరకు.సమన్వయం పాటించు.సమబుద్ధి అవలంబించు.నీవు ఆధ్యాత్మిక జ్ఞానానికి పెద్ద పీట వెయ్యి.
No comments:
Post a Comment