Sunday, 15 March 2026
శ్రుతి విప్రతి పన్నాతే
శ్రుతి విప్రతి పన్నాతే యదా స్థాస్యతి నిశ్చలా।
సమాధావచలా బుద్ధిః తదా యోగమవాప్స్యసి॥53॥2॥
శ్రీమద్భగవద్గీత...సాంఖ్య యోగము...
శ్రీకృష్ణుడు అర్జునుడికి ఇంకా ఇలా చెబుతున్నాడు.అర్జునా!పొద్దున లేచి మనం ఏదో ఒకటి వింటుంటాము.అందులో కొన్నిటికి తీవ్రంగా స్పందిస్తాము.కొన్నిటికి ఒక మోస్తరుగా!కానీ స్పందించక మానము.దాని వలన మన మనసు చపలత పొందితుంది.ఇది కావాలి,అది వద్దు.దీనికి దగ్గర కావాలి,దానికి దూరం కావాలి.ఇంకో విషయం గురించి పలాయనం చిత్తగించాలి అనుకుంటాము.కానీ మన మనసు,బుద్ధి వీటన్నిటికంటే ఉన్నతంగా ఆలోచించాలి.స్థిత ప్రజ్ఞత ప్రదర్శించగలగాలి.స్థిరంగా,దేనికీ చలించకుండా,చిత్త చాంచల్యం చూపకుండా ఉండగలగాలి.అప్పుడే యోగాన్ని పొందగలతావు.యోగము అంటే ఓయమ్మో అని భయపడపనిలేదు.మనసును నిర్మలంగా ఉంచుకోగలగటమే,ఆటూపోటూ అనుకోకుండా.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment