Friday, 6 March 2026
కామాత్మానః స్వర్గపరా
కామాత్మానః స్వర్గపరా జన్మకర్మ ఫలప్రదామ్।
క్రియా విశేషబహుళాం భోగైశ్వర్యగతిం ప్రతి॥43॥2॥
శ్రీమద్భగవద్గీత..।సాంఖ్య యోగము...
శ్రీకృష్ణుడు అర్జునుడికి చెబుతున్నాడు.అర్జునా!చాలా మందికి స్వర్గం దక్కాలి అనే లాలస ఎక్కువ ఉంటుంది అని చెప్పాను కదా!ఆ కోరిక,కామన ఎక్కువై లెక్కకు మిక్కిలి కర్మకాండలలో మునిగి తేలుతుంటారు.ఎవరు ఏమి చెప్పినా స్వర్గ ప్రాప్తి విషయంగా,ముందు వెనకా చూసుకోకుండా,సరైన ఆలోచన,వితరణ లేకుండా చేసేస్తుంటారు.అక్కడ మనసు భగవంతుడి పైన లగ్నం చేయడం,నిబద్ధత ఉండడం ఉండవు.ఎట్లో ఒకట్ల సంపాదించేసెయ్యాలి అనే ఆరాటమూ,కోరిక తప్ప.దానికి పర్యవసానం ఏందే చెప్పమంటావా?వాళ్ళందరూ కూడా జనన మరణ ప్రవాహంలో కొట్టుకు పోతారు తప్ప,స్వర్గము,మోక్షము అనే తీరం చేరరు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment