యామిమాం పుష్పితాం వాచం ప్రవద న్త్యవిపశ్చితః।
వేద వాదరతాః పార్థ నాన్య దస్తీతి వాదినః॥42॥2॥
శ్రీమద్భగవద్గీత...సాంఖ్య యోగము...
శ్రీకృష్ణుడు ఎలాంటి మొహమాటం లేకుండా మానవుడి బుద్ధి ఎలా ఉంటుందో అర్జునుడికి చెబుతున్నాడు.హే అర్జునా!హే పార్థా!వివేకం లేని జ్ఞానం వలన ఎలాంటి ఉపయోగము ఉండదు.కొందరు వేదాలు చదివేస్తారు,ఏమి చేస్తే స్వర్గం దక్కుతుంది అని.స్వర్గ ప్రాప్తి సాథన లాలసలో పడి లేస్తుంటారు.లేచేది ఏంది?ఘాటుగా మునుగుతుంటారు.దానికి మించినది లేదని తెగ వాదిస్తుంటారు.మాటలు,చేతలు తప్ప మనస్పూర్తిగా,మనసా వాచా కర్మణా పాటించరు.
No comments:
Post a Comment