Monday, 9 March 2026
యోగస్థః కురు కర్మాణి
యోగస్థః కురు కర్మాణి సంగం త్యక్త్వా ధనంజయ।
సిద్ధ్య సిద్ధ్యో స్సమో భూత్వా సమత్వం యోగ ఉచ్యతే॥48॥2॥
శ్రీమద్భగవద్గీత..।సాంఖ్య యోగము...
కృష్ణుడు లాంటి స్నేహితుడు మన అందరికీ ఉంటే ఎంత బాగుంటుందో కదా!అర్జునుడికి సరి అయిన సమయంలో కర్తవ్యం బోథిస్తున్నాడు.ఏది ఒప్పు,ఏది తప్పు చెబుతున్నాడు.భయం పోగొట్టి ధైర్యం చెబుతున్నాడు.
శ్రీకృష్ణుడు అర్జునుడితో అంటున్నాడు.హే ధనంజయా!హే పార్థా!మనము ముందర ద్వంద్వ వైఖరి మానుకోవాలి.లాభం,నష్టం...ఈ రెండింటినీ ఒకేలాగా చూడగలగాలి.ఏ విషయమైనా మోహము,లాలస ఉండకూడదు.యోగబద్థుడుగా అవాలి.మనము అనుకున్న పనులు అనుకూలంగా పూర్తి అయినా,ఏ కారణం చేత అయినా సఫలం కాలేక పోయినా మనము విచారించకుండా ఉండగలగాలి.సమబుద్ధి ప్రదర్శించాలి.నియమిత కర్మలు ఆచరించాలి.నియమిత కర్మలు అంటే నిత్య కర్మలు.మన మనసు తామరాకు మీద నీటి బొట్టులాగా వ్యవహరించాలి.నిష్టగా,చిత్తశుద్ధితో మనము చేయాల్సిన కర్మలు ఆచరించాలి,కానీ ప్రతిఫలాపేక్ష లేకుండా!
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment