Wednesday, 25 March 2026
తృతీయోఽధ్యాయః…కర్మ యోగః..జ్యాయసీ చేత్కర్మణస్తే
అర్జున ఉవాచ..
జ్యాయసీ చేత్కర్మణస్తే మతా బుద్ధి ర్జనార్దన।
తత్కిం కర్మణి ఘోరే మాం నియోజయసి కేశవః॥1॥3॥
శ్రీమద్భగవద్గీత..కర్మయోగము..
అర్జునుడు శ్రీకృష్ణుని సాంగత్యంలో జ్ఞాన పిపాసి అవుతున్నాడు.శుభ పరిణామం కదా!కృష్ణా!ఇంత సేపూ నువ్వు చెప్పింది చూస్తే నాకొకటి అనిపిస్తుంది.కర్మ యోగము కన్నా జ్ఞాన యోగమే గొప్పదని నువ్వు అభిప్రాయపడుతున్నావేమో అనిపిస్తుంది.నిజమేనా?అట్లాంటప్పుడు ఘోర కర్మము అయిన ఈ యుద్ధానికి నన్ను ఎందుకు ప్రేరేపిస్తున్నావు?ప్రోద్బలం చేస్తున్నావు?నన్ను నియోగిస్తున్నావు?నీ మాటలకూ,చేతలకూ తేడా ఎందుకు?
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment