Tuesday, 3 March 2026
ఏషా తేఽభిహితా సాంఖ్యే
ఏషా తేఽభిహితా సాంఖ్యే బుద్ధిర్యోగే త్విమాం శృణు।
బుద్ధ్యా యుక్తో యయా పార్థ కర్మబంధం ప్రహాస్యసి॥39॥2॥
శ్రీమద్భగవద్గీత...సాంఖ్య యోగము...
శ్రీకృష్ణుడు అర్జునుడితో అనునయంగా చెబుతున్నాడు.పార్థా!కిరీటీ!ఇప్పటి దాకా నేను నీకు ఆత్మ తత్త్వం గురించి చెప్పాను.అది నీకు అర్థం అయిందనే ఆశ పడుతున్నాను.ఇప్పుడు ఇంక నీకు కర్మయోగము గురించి చెబుతాను.సాంఖ్య యోగము అంటే జ్ఞాన యోగము.ఏ యోగ జ్ఞానం వలన నువ్వు కర్మ బంధాలలో ఇరుక్కోవో,ఆ విశిష్టమయిన కర్మ యోగాన్ని నీకు పరిచయం చేస్తాను.మనసు లగ్నం చేసి మంచిగా విను.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment