Sunday, 1 March 2026
హతో వా ప్రాప్స్యసే స్వర్గం
హతోవా ప్రాప్స్యసే స్వర్గం జిత్వా వా భోక్ష్యసే మహీమ్।
తస్మా దుత్తిష్ఠ కౌంతేయ యుద్ధాయ కృతనిశ్చయః॥37//2/
శ్రీమద్భగవద్గీత...సాంఖ్య యోగము...
శ్రీకృష్ణుడు అర్జునుడికి మంచి మాటలు చెబుతున్నాడు.అర్జునా!పాండవ మథ్యమా!ఎందుకు ఈ గందరగోళం,గలభా గలభా!ప్రశాంతంగా ఆలోచించు.నీకే అర్థమవుతుంది.యుద్ధం చేస్తూ చేస్తూ మరణించావనుకో వీరమరణం పొందావని అందరూ నిన్ను శ్లాఘిస్తారు.అంతేనా?స్వర్గం పొందుతావు.అక్కడ స్వర్గ సుఖాలూ పొందుతావు.చెడుగా ఎందుకు అనుకోవడం.యుద్ధం చేసి గెలిచావనుకో!ఈ భూలోకంలో రాజ్యాన్నీ పొందుతావు,సకల సౌభాగ్యాలూ అనుభవిస్తావు.అంటే ఎటుపోయి ఎటొచ్చినా నువ్వు సుఖపడటం ఖాయం!
మరి అట్లాంటప్పుడు ఈ పనికిమాలిన తర్జన భర్జనలు ఎందుకు?యుద్థం చేస్తాను,చెయ్యాలి,గెలవాలి అని ధృఢ సంకల్పంతో లేచి నడుము బిగించు.కదన రంగంలో కదం తొక్కు.నీకు తిరుగు లేదు.విజయం నీ ముందర వచ్చి వాలుతుంది.సానుకూల ధృక్పథంతో శంఖం పూరించు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment