Wednesday, 4 March 2026
వ్యవసాయాత్మికా బుద్ధి
వ్యవసాయాత్మికా బుద్ధి రేకేహ కురునందన।
బహుశాఖా హ్యనంతాశ్చ బుద్ధయో వ్వయసాయినామ్॥41॥2॥
శ్రీమద్భగవద్గీత...సాంఖ్య యోగము...
అర్జునుడికి శ్రీకృష్ణుడు విపులంగా వివరిస్తున్నాడు.ఓ అర్జునా!కురునందనా!ఈ యోగంలో అన్నిటికంటే నిశ్చలమయిన బుద్ధి ఉండడం చాలా ముఖ్యం.ఎందుకంటే అది ఒక్కటే ఏక కారణంగా ప్రకాశిస్తుంది.అంటే మనసు నిశ్చలమయితే మనము సరిగ్గా ఒకే విషయం పైన దృష్టి సాధించగలము.అనుకున్నది అనుకున్నట్లు సాథించగలము.అదే నిశ్చయత్వము లేదనుకో,ఏమవుతుంది.కనిపించనివన్నీ కావాలనిపిస్తుంది.ప్రతిదీ చేయాలనిపిస్తుంది.మనసుకు నిగ్రహం ఉండదు.అన్నిటి వెనకా వెంపర్లాడుతుంటుంది.ఏది కావాలి,ఏది వదులుకోవాలి అనే ఖచ్ఛితత్వం ఉండదు.ఇంతకీ నేను చెప్పొచ్చేది ఏందంటే నిశ్చయ వివేకం లేని వారి జ్ఞానము అనేక భేదాలతో,అనంత ముఖాలుగా ఉంటుంది.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment