విహాయ కామాన్ యస్సర్వాన్ పుమాం శ్చరతి నిస్పృహః।
నిర్మమో నిరహంకారః స శాంతి మధిగచ్ఛతి॥71॥2॥
శ్రీమద్భగవద్గీత..సాంఖ్య యోగము...
శ్రీకృష్ణుడు ఇలా చెబుతున్నాడు.అర్జునా!మనము మొట్టమొదటగా కోరికలకు స్వస్తి చెప్పాలి.అన్ని అరిష్టాలకూ అవే కదా మూల హేతువు.అహంకారం అనేది ఇంకో పెద్ద గుదిబండ.దానిని తీసి ప్రక్కన పెట్టాలి.ఈ రెంటినీ వదలి మోహానికీ,మమకారానికీ స్వస్తి వచనాలు చెప్పాలి.ఇలా ఉండగలిగిన పురుషుడే శాంతిని,మనశ్శాంతినీ పొందగలడు.
No comments:
Post a Comment