Sunday, 8 March 2026
యావానర్థ ఉదపానే
యావానర్థ ఉదపానే సర్వత స్సంప్లుతోదకే।
తావాన్ సర్వేషు వేదేషు బ్రాహ్మణస్య విజానతః॥46॥2॥
శ్రీమద్భగవద్గీత...సాంఖ్య యోగము..।
శ్రీకృష్ణుడు అర్జునుడికి సూక్ష్మంలో మోక్షం గురించి చెబుతున్నాడు.అర్జునా!నా తట్టు చూడు.నేను చెప్పేది అర్థం చేసుకునేదానికి ప్రయత్నించు.నీరు ఎక్కడ ఉన్నా నీరే కదా!అలాగే జ్ఞానము కూడా.ఒక ఉదాహరణ చెబుతాను విను.నూతులు,చెరువులలో తక్కువ నీళ్ళు ఉంటాయి కదా,సముద్రంతో పోలిస్తే.కానీ వీటితో ఎంత ప్రయోజనము ఉందో వాటితో కూడా అంతే కదా!వేదాలలో చెప్పిన చాలా,అహాఁ,సమస్త కర్మల వలనా శాంతి దొరుకుతుంది కదా మానవుడికి.అదే శాంతి తత్త్వవేత్త అయినవాడికి తనకున్న జ్ఞానంలోనే ఇమిడి ఉంటుంది.సూక్షమా లేక స్థూలమా అనేకంటే వాటిలో ఉండే సారమునకే ఎక్కువ విలువ అని అర్థం చేసుకో.కాబట్టి అపోహలు,అనుమానాలు,అలజడులకు ఔషథం జ్ఞానము.కాబట్టి మానవుడికి జ్ఞానసముపార్జన అత్యంత కీలకం,అత్యవసరమూను.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment