Tuesday, 10 March 2026
బుద్ధి యుక్తో జహా తీహ
బుద్ధి యుక్తో జహా తీహ ఉభౌసుకృత దుష్కృతే।
తస్మాద్యోగాయ యుజ్యస్వ యోగః కర్మసు కౌశలమ్॥50॥2॥
శ్రీమద్భగవద్గీత.।।సాంఖ్య యోగము...
అర్జునుడికి కిటుకు చెబుతున్నాడు శ్రీకృష్ణుడు.అర్జునా!తెలివి గలవాడు ఏం చేస్తాడో నీకు తెలుసా?లెక్కలన్నీ ఎప్పటికప్పుడు చూసుకుని సమంచేసుకుంటాడు.సమబుద్ధి కలవాడు తన పాపపుణ్యాల లెక్కలను కూడా ఈ జన్మలోనే నశింపచేసుకుని జీవితమనే పలకను శుభ్రం చేసుకుంటాడు.ఎలాంటి అర్థం పర్థంలేని గీతలు ఉండకుండా.నా దృష్టిలో నువ్వు కూడా అలాంటి యోగాన్ని ఆశ్రయించి,అనుసరించి కర్మలను ఆచరిస్తే మంచిది అని నా అభిప్రాయం.నువ్వేమంటావు?
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment