Saturday, 7 March 2026
త్రైగుణ్య విషయా వేదా
త్రైగుణ్య విషయా వేదా నిస్త్రైగుణ్యో భవార్జున।
నిర్ద్వంద్వో నిత్యసత్త్వస్థో నిర్యోగ క్షేమ ఆత్మవాన్॥45॥2॥
శ్రీమద్భగవద్గీత..।సాంఖ్య యోగము....
శ్రీకృష్ణుడు అర్జునుడు మంచిగా పేరు తెచ్చుకోవాలి అని ఆశిస్తున్నాడు.అందుకని ప్రతిదీ ఓపికగా,విపులంగా వివరిస్తున్నాడు.అర్జునా!వేదాలు ప్రకృతి యొక్క మూడు గుణాలను వివరించాయి.నువ్వు ఆ త్రిగుణాలకు అతీతంగా నిలబడాలి.ద్వంద్వ భావాలకు స్వస్తి చెప్పాలి.ఏదైనా సాధించాలి,సాధించిన వాటిని నిలుపుకోవాలి,అదే యోగక్షేమాలు,అనే ఆదుర్దా,దుగ్థ,అపేక్ష నిర్ద్వంద్వంగా వదులుకోవాలి.శుద్థ సత్వాన్ని అవలంబించాలి.అంటే రజోగుణము,తమోగుణము మరకలు అంటని పవిత్రమయిన సత్త్వగుణ మార్గాన్ని ఎంచుకోవాలి.బాహ్య బంధాలను విడిచి పెట్టి ఆత్మ జ్ఞానివి కావాలి.ఇదే నా కోరిక!
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment