Thursday, 26 March 2026
వ్యామిశ్రేణేవ వాక్యేన
వ్యామిశ్రేణేవ వాక్యేన బుద్ధిం మోహయసీవ మే।
త దేకం వద నిశ్చిత్య యేన శ్రేయోఽహమాప్నుయాత్॥2॥3॥
శ్రీమద్భగవద్గీత...కర్మ యోగము...
శ్రీకృష్ణుడు తనకు చెప్పే మాటలు వింటుంటే అర్జునుడికి పిచ్చి రేగి పోతున్నది.ఏ ఒక్కటీ అర్థం కావటం లేదు.ఏదో కొంచెం బోథ పడుతుందిలే అని అనుకునేలోపల ఇంకాస్త ఎక్కువ గందరగోళం అనిపిస్తున్నది.ఇంక ఉండబట్టలేక శ్రీకృష్ణుడితో అంటున్నాడు.ఏంది స్వామీ?ఒక సారి మాట్లాడినట్లు ఇంకే సారి మాట్లాడవు?నీ మాటలతో నా బుర్ర గిర్రున తిరుగుతుంది.ఇంకా ఇంకా అయోమయంలో పడిపోతున్నాను.ఒక సారి జ్ఞానం గొప్పది అంటావు.అది ఒంట పట్టిచ్చుకునేలోపల కర్మ గొప్పది అని అంటావు.నువ్వే ముందర తేల్చుకో ఈ రెండింటిలో ఏది గొప్పది అని.ఆ తరువాత నాకు ఏది శ్రేయస్కరమో చెప్పు.కప్పదాటు వ్యవహారాలు వద్దు సుమా!నాకు ఏది మంచిదో ఖచ్ఛితత్వంతో సూటిగా చెప్పు.అంటే రామబాణంలాగా సూటిగా లక్ష్యం చేరుకోవాలి.అంతేగానీ,ఊరికినే అటు త్రిప్పి,ఇటు త్రిప్పి మాటల గారడీ చేయవద్దు .
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment