Monday, 9 March 2026
కర్మణ్యే వాధికారస్తే
కర్మణ్యే వాధికారస్తే మా ఫలేషు కదాచన।
మా కర్మ ఫల హేతుర్భూః మాతే సంగో స్త్వ కర్మణిః॥47॥2॥
శ్రీమద్భగవద్గీత..సాంఖ్య యోగము...
శ్రీకృష్ణుడు అర్జునుడికి ధర్మ సూత్రం చెబుతున్నాడు.హే పార్థా!ఓ అర్జునా!కర్మ చేయడం వరకే నీ వంతు.కర్మఫలం ఆశించడం నీ పని కాదు.నేను చేసే పనికి ఫలితం నాకే దక్కాలి అని ఆశించకు.నీకు హక్కులేదు.ఏ పని ఎప్పుడు,ఎలా,ఎంతలా,ఎక్కడ చేస్తే నాకు కావాల్సిన ఫలితం దక్కుతుంది అనే కోరికతో ఏ పనీ చేయవద్దు.నాకు లాభం లేనప్పుడు నేను ఎందుకు చెయ్యాలి ఏదైనా అని మానుకోవద్దు.ఎందుకంటే కర్మలు చేయడమే మన ధర్మము.వాటి ఫలాలకు మనము అధికారులు కాదు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment