Monday, 30 March 2026
నియతం కురు కర్మత్వం
నియతం కురు కర్మత్వం కర్మజ్యాయో హ్యకర్మణః।
శరీర యాత్రాపి చ తే న ప్రసిద్ధ్యే దకర్మణః॥8॥3॥
శ్రీమద్భగవద్గీత..।కర్మ యోగము...
శ్రీకృష్ణుడు చిన్నగా అర్జునుడిని దారిలోకి తెచ్చేదానికి ప్రయత్నిస్తున్నాడు.అర్జునా!ఇప్పుడే చెప్పాను కదా ఉత్తముడు ఎలా ఉంటాడు అని.నీకేమనిపిస్తుంది?అలా చేయగలను అనే నమ్మకం పుడుతుందా?నీవు ఇంక ఇప్పుడు ఏమి చేయాలో చెబుతాను విను.నీవు నీకు నిర్ణయించబడిన నియమిత కర్మలను ఆచరించు.వాటి వలన లాభమా,నష్టమా?ఇష్టమా?కష్టమా?ఇవన్నీ ప్రక్కన పెట్టు.నీ ధర్మాన్ని పాటించు.క్షత్రియ ధర్మం ఏంది?ప్రజలను కాపాడటం !అవసరమైతే కరవాలమెత్తి దుష్టులను సంహరించడం!నేను ఏమీ చేయను.ముసుగేసుకుని మూలన కూర్చుంటాను.అది పాపం.ఇది పుణ్యం.వీళ్ళు మనవాళ్ళు,వాళ్ళు పరాయి వాళ్ళు.ఈ ఝంఝాటకాలు మానేసెయ్యి.
ఎందుకో చెప్పేదా.ఏ పనీ చేయకపోవడం వలన దేహయాత్ర చాలా దుర్భరమవుతుంది.నీకు అర్థం కావటం లేదు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment