Tuesday, 17 February 2026
వేదావినాశినం నిత్యం
వేదావినాశినం నిత్యం య ఏన మజ మవ్యయమ్।
కథం స పురుషః పార్థ కం ఘాతయతి హన్తి కమ్॥21॥2॥
శ్రీమద్భగవద్గీత...సాంఖ్య యోగము...
శ్రీకృష్ణుడు పరి పరివిథాలా తపిస్తున్నాడు... అర్జునుడు తను చెప్పేది అర్థం చేసుకోవాలని.అరటి పండు ఒలిచి నోట్లో పెట్టినంత పని చేస్తున్నాడు.ఇంక అర్జునుడు నమిలి,మింగితే చాలు!
అర్జునా!నేను చెప్పాను కదా...ఆత్మ నాశనం లేనిదని.అలాగే నిత్యము అయినది అని.ఇంకా ఇంకా దాని గురించి ఇలా చెప్పాను కదా.ఆత్మకు వృద్థి,క్షయములు లేవు.అంటే పెరగదు,తరగదు.వ్యము కానిది కూడా!ఇవన్నీ తెలిసిన నేను కానీ ఇంకొకరు కానీ వేరొకరిని చంపడానికి ఎందుకు ప్రేరేపిస్తారు అసలు?తాము మటుకు ఎందుకు,ఎవరినైనా చంపుతారు చెప్పు?ఆలోచించు నిదానంగా.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment