యే త్వత దభ్యసూయంతో నానుతిష్ఠంతి మే మతమ్।
సర్వ జ్ఞాన విమూఢాం స్తాన్ విద్ధి నష్టా నచేతసః॥32॥3॥
శ్రీమద్భగవద్గీత...కర్మ యోగము...
శ్రీకృష్ణుడు తనను నమ్మకపోతే వచ్చే అనర్థాన్ని సూచిస్తున్నాడు.అర్జునా!ఎవరైనా మంచి మాటలు వింటే బాగుపడతారు.లేకపోతే భ్రష్టు పట్టిపోతారు.ఇది తిట్టడమో,శాపనార్థాలు పెట్టడమో కాదు.కటిక నిజం!ఎవరైతే అసూయకు లోను అవుతారో,అలా అయి నా మాటలను పెడచెవిన పెడతారో,వాళ్ళను భ్రష్టులుగా గుర్తించు.వాళ్ళు మూఢులు అని అర్థం చేసుకో.అంతకంటే నేను చెప్పేది ఇంకేమీ లేదు.
No comments:
Post a Comment