ప్రకృతేః క్రియమాణాని గుణైః కర్మాణి సర్వశః।
అహంకార విమూఢాత్మా కర్తాఽహమితి మన్యతే॥27॥3॥
శ్రీమద్భగవద్గీత...కర్మ యోగము...
శ్రీకృష్ణుడు అర్జునుడికి అజ్ఞానులు ఎలాంటి భ్రమలలో బ్రతుకుతుంటారో చెబుతున్నాడు.అర్జునా!హే కిరీటీ!నీకు ఇప్పుటికి అర్థం అయింది కదా ప్రకృతి యొక్క గుణాల వల్లనే సమస్తమయిన కర్మలూ నిర్వహింపబడతాయి అనే విషయం.కానీ అజ్ఞాని అలా అర్థం చేసుకోడు.అజ్ఞానికి అహంకారం,అదే బలుపు ఎక్కువ కదా!నేనే తోపు,నేనే తురుపు ముక్కను.అంతా నా వల్లనే జరుగుతుంది,అంతా నేనే చేస్తున్నాను అని భావిస్తూ ఉంటాడు.నిజంగా మూర్ఖుడు అందామా ?లేక అమాయకుడు అని అందామా?
No comments:
Post a Comment