Saturday, 4 April 2026
ఇష్టాన్ భోగాన్ హి వో దేవా
ఇష్టాన్ భోగాన్ హి వో దేవా దాస్యంతే యజ్ఞభావితాః।
తైర్దత్తా న ప్రదాయైభ్యో యో భుంక్తేస్తేన ఏవ సః॥12॥3॥
శ్రీమద్భగవద్గీత..।కర్మయోగము
శ్రీకృష్ణుడు అర్జునుడికి బ్రహ్మ ప్రజలకు ఏమి చెప్పాడో చెబుతున్నాడు.అర్జునా!పార్థా!కిరీటీ!బ్రహ్మ ప్రజలను సృష్టించాడు అని చెప్పాను కదా!ఆ తరువాత ప్రజలకు నాలుగు మంచి మాటలు కూడా చెప్పాడు.యజ్ఞాలు చేయమన్నాడు.చేస్తే మంచిది అని చెప్పాడు.ఎందుకంటే యజ్ఞాలు చేస్తే దేవతలు తృప్తి పడతారు.అప్పుడు ప్రసన్నంగా ఉంటారు కాబట్టి మన కోరికలు తీరుస్తారు.అంటే వరుణ దేవుడు వానలు ఇస్తాడు.సూర్యుడు పగలు,వెలుతురు ఇస్తాడు.చంద్రుడు చల్లదనాన్ని ఇస్తాడు.అగ్ని దేవుడు నిప్పును ఇస్తాడు.వారి వలన,వారిచ్చే ద్రవ్యాల వలన మనము లాభం పొందుతున్నట్లే కదా!మరి మనం కృతజ్ఞత వ్యక్తపరచాలి కదా!వారి వల్ల దక్కిన ఫలాన్ని వారికి నివేదించాలి కదా!కాబట్టి వారికి నివేదించకుండా భోగించేవాడు చోరుడు అవుతాడు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment