Friday, 24 April 2026
ధూమే నావ్రియతే వహ్నిః
ధూమే నావ్రియతే వహ్విః యథాఽ దర్శో మలేన చ।
యథోల్బే నావృతో గర్భస్తథా తేనేదమావృతమ్॥38॥3॥
శ్రీమద్భగవద్గీత....కర్మ యోగము...
శ్రీకృష్ణుడు అర్జునుడికి పెద్ద పెద్ద మాటలతో కాకుండా,సగటు మనిషి అర్థం చేసుకునే రీతిలో చెబుతున్నాడు.
అర్జునా!మిత్రమా!పొగ నిప్పును కూడా కప్పేస్తుంది కదా,సరిగ్గా రాజుకోకపోతే.అద్దం కూడా మురికితో కప్పబడుతుంది కదా,మనం జాగ్రత్తగా ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోకపోతే!అవునా?కాదా?కడుపులో బిడ్జ,అదే పిండం,మావితో కప్పబడి ఉంటుంది కదా!అచ్చం అట్లాగే జ్ఞానమనేది కూడా కామముతో కప్పబడి ఉంటుంది.మనం మన జ్ఞానాన్ని సాన బెట్టుకుంటూ ఉండాలి.ఊరికినే కంఠస్తం పెడితే చాలదు,బుర్రకు కూడా ఎక్కించుకోవాలి.లేకపోతే వల్లె వేసేదానికి తప్పిస్తే ఇంక దేనికీ పనికి రాదు.అప్పుడు కామం తన పని తాను చేసుకుని,మనలను అథోగతి పాలు చేస్తుంది.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment