న బుద్ధిభేదం జనయే దజ్ఞానాం కర్మసంగినామ్।
జోషయే త్సర్వకర్మాణి విద్వాన్ యుక్త స్సమాచరన్॥26॥3॥
శ్రీమద్భగవద్గీత..కర్మ యోగము...
శ్రీకృష్ణుడు అర్జునుడికి జ్ఞాని ఎలా ఉండాలో చెబుతున్నాడు.హే అర్జునా!జ్ఞాని అనేవాడు చాలా జాగ్రత్తగా నడచుకోవాలి.కర్మలు ఆచరించే మామూలు ప్రజానీకాన్ని గందరగోళానికి గురి చేయకూడదు.వారు కర్మల ఎడ విముఖులు కాకుండా చూసుకోవాలి.తాను కర్మలను అనుసరించి,ఆచరిస్తూ మామూలు ప్రజానీకం తప్పుదారి పట్టకుండా,మంచిగా సమన్వయం చేసుకుంటూ,వారంతా కూడా సత్ కర్మల యెడ అనురక్తిని కలిగించేలా ప్రవర్తించాలి.
No comments:
Post a Comment